- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రగతి భవన్ కాదు.. ఇక ప్రజా భవన్: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఈ గెలుపు తెలంగాణ ప్రజలది.. కాంగ్రెస్‌కు విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇవాళ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని.. ఈ తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని.. డిసెంబర్ 3 2023 చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీకాంత్ చారి డిసెంబర్ 3వ తేదీన అమరడయ్యాడని.. ఇదే రోజు కాంగ్రెస్ సాధించిన ఈ విజయం అమరులకు అంకితం ఇస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఇక సచివాలయం గేట్లు అందరికి తెరుచుకుంటాయని.. ప్రగతి భవన్ ఇక డాక్టర్ అంబేద్కర్ భవన్‌గా మారుతుందని తెలిపారు. ఇకపై అది ప్రగతి భవన్ కాదని.. ప్రజా భవన్ అని తెలిపారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
- Tags
- revanth reddy