- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో కీలక సీఎం అంశం ప్రస్తావన.. బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు
దిశ, సిరిసిల్ల: నేరెళ్ల ఘటన జరిగి ఆరున్నరేళ్లయినా.. నేటికీ గాయాలు మానలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. గత పాలకులు హామీ ఇచ్చి మరిచిపోవడంతో బాధితులు ఇంకా ఆస్పత్రులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడం, నేరెళ్ల ఘటనను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు ఆర్థిక, న్యాయ సహాయమందుతుందని వారు భావిస్తున్నారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, జైలుకు పంపినప్పుడే తమకు న్యాయం జరిగినట్లవుతుందని బాధితులు పేర్కొంటున్నారు.
2017 జూలై 3 తర్వాత..
రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేరు)లో ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ఇసుక తరలించేందుకు అప్పటి ప్రభుత్వం మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. వీటినుంచి రోజుకు వందల లారీల్లో ఇసుకను హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మద్యం తాగి వాహనాలు నడపడంతో 40కి పైగా ప్రమాదాలు జరిగాయి. 2017 జూలై 3న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద నేరెళ్ల గ్రామానికి చెందిన ఎరుకల భూమయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఇసుక లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగ్రహానికి గురైన అతని బంధువులు, గ్రామస్తులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో పెంట బాణయ్య, కోల హరీశ్, చెప్పాల బాలరాజు, పశుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, బత్తుల మహేశ్, కోరుకొండ గణేశ్, చీకటి శ్రీనివాస్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులపాటు చిత్రవధ చేసి, జూలై 7న వారి అరెస్టు చేసినట్లు చూపారు.
రిమాండ్‌ను తిరస్కరించిన జైలర్
అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని పోలీసులు కరీంనగర్ జైలుకు తీసుకెళ్లగా, వారిపై ఉన్న గాయాలు చూసి జైలర్ రిమాండ్ ను నిరాకరించారు. ఆ తర్వాత పోలీసులు వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొచ్చి వారిని జైలుకు తరలించారు. కారాగారంలో జైలర్ వారిని వైద్యులతో పరీక్షలు చేయించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించి, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని పరామర్శించారు. విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లి నేరెళ్ల ఘటనను ప్రపంచానికి తెలియజేశారు.
హామీ ఇచ్చి మరిచిన కేటీఆర్..
నలభై రోజుల తర్వాత అప్పుడు మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ బాధితులను పరామర్శించారు. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో నేరెళ్ల బాధితులు కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడుల్లా ఏదో ఒక రకంగా నిరసన తెలుపుతూ పోరాటం కొనసాగించారు. ఈ ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ సుమోటాగా తీసుకొని విచారించింది. మొత్తంగా పోలీసులు చూపించిన అత్యుత్సాహం బీఆర్ఎస్ పార్టీకి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాయని మచ్చను తెచ్చిపెట్టింది.
సీఎం రేవంత్ నోట.. నేరెళ్ల బాధితుల మాట
నేరెళ్ల బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వారిని పరామర్శించారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమారి, అప్పటి పీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరెళ్లకు వెళ్లి బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నేరెళ్ల ఘటను అసెంబ్లీలో ప్రస్తావించారు.
రేవంత్ మాటతో ధైర్యం వచ్చింది: కోల హరీశ్, నేరెళ్ల బాధితుడు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేరెళ్ల ఘటనను ప్రస్తావించడంతో మాకు ధైర్యం వచ్చింది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. సంబంధిత పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, జైలుకు పంపినప్పుడు మాకు న్యాయం జరిగినట్లు. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఏ పని చేసుకునే పరిస్థితుల్లో లేము. ప్రభుత్వం మమ్మల్ని ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై మాకు నమ్మకమున్నది.
న్యాయం చేస్తాం: ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
నేరెళ్ల ఘటన అమానుషం. అప్పటి ప్రభుత్వం అండతో పోలీసులు పశువుల్లా ప్రవర్తించారు. నేరెళ్ల ఘటన ప్రభుత్వం దృష్టిలో ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నేరెళ్ల గురించి ప్రస్తావించారు. ఘటనను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చూస్తున్నారు. బాధితులు అధైర్య పడొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది.