- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాల ధరల పెంపుపై నేడు కీలక ప్రకటన?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాల ధరల పెంపు ప్రక్రియ షురూ అయింది. ప్రభుత్వం విజయ డెయిరీ పాల ధరల పెంపుపై నేడు సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి బల్క్ మిల్క్ సెంటర్ల యూనిట్ల పరిధిలోని జిల్లాల్లో ముగ్గురు రైతులకు అధికారులు ఆహ్వానాన్ని అందించారు. నేడు జరగబోయే సమావేశంలో గేదె, ఆవు పాల ధరలపై వెన్న శాతం ప్రకారం ధరలు నిర్ణయించనున్నారు. అయితే ఈ ధరలను కేజీ ఫ్యాట్ రూపంలో నిర్ణయిస్తారు. ఈ మేరకు ప్రస్తుతం గేదె పాలకు కేజీ ఫ్యాట్ ప్రకారం ఇస్తున్న రూ.680 ను రూ.730 గా, ఆవుపాలకు ఇస్తున్న రూ.270 ను రూ.320 గా పెంచాలని సూత్రప్రాయంగా విజయ డెయిరీ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో గేదె పాలకు ప్రస్తుత ధరపై రూ.2 నుంచి రూ.2.50 పెరిగే అవకాశం ఉన్నదని సమాచారం.
రైతుల నుంచి బల్క్ మిల్క్ సేకరణ..
పాల ధరల పెంపు నేపథ్యంలో కేజీ ఫ్యాట్ చొప్పున డెయిరీ సేకరిస్తోన్న పాలను ఇక మీదట బల్క్ మిల్క్ గా కూడా సేకరిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన అధికారులు చర్చిస్తున్నారు. దీని ప్రకారం ఆసక్తి ఉన్న బీఎంసీల నుంచి బల్క్ మిల్క్ ను సేకరించి అందుకు కేజీ ఫ్యాట్ తో పాటు, అదనంగా లీటర్ పాలకు రూ.2.50 ఇస్తే ఎలా ఉంటుందని కూడా నేటి సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ బల్క్ మిల్క్ సేకరణతో బీఎంసీలు మిల్క్ ను చిల్లింగ్ చేసి, ప్యాకింగ్ కు సిద్ధంగా ఉన్న పాలను అందించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే చంపాపేటకు చెందిన సరిత డెయిరీకి బల్క్ మిల్క్ సేకరణ కింద గేదె పాలకు కేజీ ఫ్యాట్ కు రూ.897ను ఇస్తున్నారు. అయితే రైతులకు మాత్రం నిర్ణయించిన కొత్త ధరలను ఇచ్చి, అదనంగా ఇంకొంత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై నేడు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.
పెరిగిన దాణా ఖర్చుల ప్రకారం పాల ధరలు పెంచాలి..
ప్రస్తుతం పాల సేకరణ ధరల పెంపుకు సంబంధించి రైతుల నుంచి సేకరించే పాలకు మాత్రం పెరిగిన పశువుల దాణా ఖర్చుల మేరకు పాల ధరలను పెంచాలని పాడి రైతులు కోరుతున్నారు. దీనితో పాటు 10 ఏండ్ల నుంచి పాల సొసైటీ ఎన్నికలు నిర్వహించడం లేదని, వెంటనే సొసైటీ ఎన్నికల నిర్వహణకు సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా పాల సొసైటీకి పాలు పొసే రైతులను మాత్రమే చైర్మన్ గా నియమించాలని కూడా సూచిస్తున్నారు. చూడాలి మరి విజయ డెయిరీ అధికారులు నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో.
Also Read : వాళ్లే టార్గెట్.. బీజేపీ మరో సరికొత్త ప్లాన్