- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన.. రేపటి నుంచే ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) సేవల్లో కీలక మార్పులు చేశారు. కార్గో సేవలు ఇక నుంచి ఇంటి వద్దకు వస్తాయని ప్రకటించారు. హైదరాబాద్(Hyderabad)లో పైలట్ ప్రాజెక్ట్(Pilot Project)గా హోం డెలివరీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ హోం డెలివరీ(Home Delivery) సేవలు రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ హోం డెలివరీ(Home Delivery) సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కోరారు.
హోం డెలివరీ చార్జీలివే..
0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
1.01 నుంచి 5 కేజీలకు రూ.60
5.01 నుంచి 10 కేజీలకు రూ.65
10.1 నుంచి 20 కేజీలకు రూ.70
20.1 నుంచి 30 కేజీలకు రూ.75
30.1 కేజీలు దాటితే పైన పేర్కొన్న స్లాబ్ల ఆధారంగా ధరలు ఉంటాయి.