- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఆర్ చేసి శిశువు ప్రాణాలు కాపాడిన కీసర 108 సిబ్బంది..
దిశ, జవహర్ నగర్: మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కుందనపల్లి గ్రామంలో నివసిస్తున్న ఆర్తి కుమారి (20) అనే మహిళకు శనివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో మొదటి కాన్పు పురిటి నొప్పులు రావడంతో వారు కీసరలోని లైఫ్ షేవ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆర్తి కుమారిని పరీక్షించి, నెలలు పూర్తిగా నిండలేదు, అలాగే మొదటి కాన్పు కాబట్టి ఆపరేషన్ చేయాలని, పుట్టబోయే బిడ్డ ఎదుగుదల సరిగా లేదు కాబట్టి, బిడ్డను ఐసీయూలో పెట్టాల్సి వస్తుందని అని చెప్పి దీనికి చాలా ఖర్చు అవుతుందని వారు సూచించారు.
కోళ్ల ఫారంలో పనిచేస్తున్న తాము అంత ఖర్చు పెట్టలేమని చెప్పడంతో హాస్పిటల్ డాక్టర్లు గాంధీ హాస్పిటల్ కి వెళ్లమని సూచించారు. అప్పుడు వారు 108 కి కాల్ చేసి వారి పరిస్థితిని 108 సిబ్బందికి వివరించగా తెల్లవారుజామున 3.36 సమయంలో కీసర 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, ఆర్తి కుమారిని అంబులెన్స్ లో తీసుకొని వెంటనే అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించి, నెలలు పూర్తిగా నిండలేదని గమనించి, బ్లడ్ కూడా తక్కువగా ఉంది, పుట్టబోయే బిడ్డ ఎదుగుదల సరిగా లేదు కాబట్టి ప్రాణ హాని ఉందని గమనించిన ఈఎంటీ చిత్రం రవి వెంటనే గ్లూకోస్ ద్రవాలు ఎక్కిస్తూ గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు.
మార్గ మధ్యలో నాగారం సమీపంలోకి వెళ్లగానే ఆర్తి కుమారికి పురిటి నొప్పుల తీవ్రత ఎక్కువగా అయింది. వెంటనే పరిస్థితి అర్థం చేసుకున్న ఈఎంటీ రవి డెలివరీ చేయాల్సి వస్తుందని గ్రహించి డెలివరీ చేయడానికి అవసరమైన పరికరాలు తీసుకొని, వాటిని సక్రమంగా ఉపయోగించి ఆర్తికి అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేశాడు. పుట్టిన బిడ్డకు నెలలు పూర్తిగా నిండలేదు కాబట్టి తక్కువ వెయిట్ ఉండి పల్స్ లేదు బ్రీతింగ్ లేదు, అలాగే హార్ట్ బీట్ కూడా లేకుండా మగబిడ్డ బయటకు రావడం గమనించిన ఈఎంటీ రవి మరొకసారి 108డాక్టర్ ఈఆర్సీపీ డాక్టర్. మహీధ్ ఫోన్ లో బిడ్డ పరిస్థితిని వివరించారు.
అప్పుడు డాక్టర్ చెప్పే సూచనలను సక్రమంగా పాటిస్తూ బిడ్డకు సీపీఆర్ స్టార్ట్ చేసి అంబు బ్యాగ్ తో బ్రీతింగ్ అందిస్తూ ఆక్సిజన్ కూడా సరఫరా చేస్తూ గాంధీ హాస్పిటల్ వేగంగా పయనిస్తూ 5 సైకిల్స్ సీసీఆర్ చేసి బిడ్డకు హార్ట్ బీట్ వచ్చేలాగా ట్రీట్ మెంట్ ఇస్తూ గాంధీ హాస్పిటల్ కి చేరుకునే లోగా బిడ్డకు హార్ట్ బీట్, బ్రీతింగ్ వచ్చేలాగా చేసి గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు, అక్కడి వైద్యులు బిడ్డను పరిశీలించి, పరిస్థితిని అర్థం చేసుకుని 108 లో సరైన సమయంలో సీపీఆర్ చేసి బిడ్డ ప్రాణాలు కాపాడారని 108 సిబ్బందినీ బెస్ట్ ఫర్పామెన్స్ అని అబినందిచారు. ఆర్తి కుమారి కుటుంబ సభ్యులు కీసర 108 సిబ్బందికి ధన్యావాదాలు తెలిపారు. మీరు లేకుంటే మా బిడ్డా మాకు దక్కేది కాదు అనీ ఈఎంటీ చిత్రం రవి ని అత్తుకొని ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు.