కొంచెం కష్టపడితే గెలుపు మనదే.. ఆ జిల్లా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

by GSrikanth |
కొంచెం కష్టపడితే గెలుపు మనదే.. ఆ జిల్లా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం కష్టపడితే మెజార్టీ స్థానాల్లో గెలుపు మనదేనని గులాబీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ ప్రభావం ఉండదన్నారు. హైదరాబాద్ నందినగర్‌లో గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నాయకులు పోయినంత మాత్రానా భయపడొద్దని, గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు పార్టీకి బలంగా ఉన్నారన్నారు.

కాంగ్రెస్‌పై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ హామీలను విస్మరించిన విషయాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. ఈ భేటీకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గైర్హాజర్ అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రులు జోగు రామన్న, వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed