- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ.. ‘గంప’ వేసిన మైండ్ బ్లోయింగ్ స్కెచ్ ఇదేనా..?
దిశ, కామారెడ్డి : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వీకుల గ్రామం పోసానిపల్లి (కొనాపూర్) కామారెడ్డి సెగ్మెంట్‌లో ఉన్నది. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేయాలని సీఎం కేసీఆర్‌ను ఇప్పటికే మూడుసార్లు కోరాను. సీఎం ఇక్కడి నుంచి పోటీ చేస్తే నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.’
- ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వ్యాఖ్యలివి..
‘కామారెడ్డిలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీని మళ్లీ ఓడించేది నేనే.’
- ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామెంట్ ఇది..
పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు..
ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేస్తున్న పరస్పర విరుద్ధమైన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఓ సారి సీఎం పోటీ చేస్తారని, మరోసారి తానే పోటీ చేస్తానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తున్నది. టికెట్టుకు పోటీ లేకుండా ఉండేందుకు, ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకే సీఎం పేరును తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతున్నది. నేడు మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో పర్యటించనుండగా.. ‘గజ్వేల్‌ను విడిచి సీఎం కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారా? అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
టికెట్టుపై డౌట్‌తోనే..!
కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ నాలుగు సార్లు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఒకసారి టీడీపీ నుంచి, మరో మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ గంప చేతుల్లో వరుస ఓటములు చవిచూస్తున్నారు. అయితే ప్రస్తుతం గంప గోవర్ధన్ స్థానికంగా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారనే వాదన వినిపిస్తున్నది. అధికారులు, ద్వితీయ శ్రేణి నాయకులు, సామాన్య ప్రజలపై నోరు పారేసుకుంటున్నారని, కోపం వస్తే చేయి సైతం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా తన అనుకున్న వాళ్లే తన వెనక గోతులు తవ్వుతున్నారని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలుస్తున్నది. తన అనుచరులు టికెట్టు ప్రయత్నాలు చేయకుండా కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారానికి తెరలేపినట్లు సమాచారం. అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే కేసీఆర్‌ను కోరినట్టుగా ఎమ్మెల్యే స్వయంగా వెల్లడిస్తుండడం గమనార్హం.
ఎమ్మెల్యే ప్రకటనపై మళ్లీ చర్చ..
ఓడిపోతాననే అనుమానంతోనే గంప గోవర్ధన్.. సీఎం కేసీఆర్‌ను కామారెడ్డికి తెస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆ తర్వాత గంప గోవర్ధన్ ఒక ప్రకటన విడుదల చేశారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే ‘ఈసారి కూడా షబ్బీర్ అలీ తన చేతిలో ఓటమి పాలు కావడం ఖాయం. గెలిచేది నేనే’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు, ప్రకటనలపై మళ్లీ చర్చ మొదలైంది.
ప్రచారానికి తెర దించినట్టేనా?
‘నేనే గెలుస్తా.. నిన్ను ఓడిస్తా’ అంటూ షబ్బీర్ అలీ శపథం చేసినట్టుగా ప్రకటన చివరలో గంప గోవర్ధన్ పేర్కొన్నారు. దీంతో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారన్న ప్రచారానికి తెర దించినట్టయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన అనుచరులు పోటీకి రాకుండా ఉండడం కోసం, ప్రతిపక్ష పార్టీల్లో విశ్వాసం సన్నగిల్లేలా కట్టడి చేయడానికే ఇన్నాళ్లు కేసీఆర్ పోటీ అన్న ప్రచారం సాగించారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.