- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Budget 2024: తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. మొత్తం అన్ని రంగాలను కలుపుకొని..2,91,191 కోట్ల అంచనా బడ్జెట్ ను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. కాగా ఈ బడ్జెట్ పై తెలంగాణ మాజీ సీఎం, అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పందించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని.. బడ్జెట్ ఒ పస లేదు పాడు లేదని.. రైతు బందుకు ఎటువంటి కేటాయింపులు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన భట్టి.. ఇలా రాసుకొచ్చారు. ఆర్భాటపు అంకెల గారెడీతో ప్రజలను మోసం చేశారు. మీరు చేసిన 6 లక్షల 71వేల 757 కోట్ల అప్పులకు, రుణాలు చెల్లిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజాభీష్టం మేరకు తయారు చేసిన వాస్తవ లెక్కలు బడ్జెట్ మాది అంటూ కేసీఆర్ కు భట్టి కౌంటర్ ఇచ్చారు.