చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్న కేసీఆర్

by Satheesh |
చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్న కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును స్వగ్రామం చింతమడకలో కేసీఆర్ శోభమ్మ దంపతులు వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి నివాసం నుంచి సోమవారం చింతమడకకు బయలుదేరి వెళతారు. ఉదయం 11.00 గంటలకు చింతమడక గ్రామంలో కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్, నంది నగర్, బంజారాహిల్స్ పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Advertisement

Next Story