ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో MLC కవిత.. భావోద్వేగానికి గురైన కేసీఆర్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-29 09:28:01.0  )
ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో MLC కవిత.. భావోద్వేగానికి గురైన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి సిబ్బంది స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భోవోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కవిత తండ్రి పాదాలకు నమస్కరించింది. అనంతరం కవితను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. దీంతో చాలాకాలం తర్వాత కేసీఆర్ మొహంలో ఉత్సాహం కపించించింది.

కాగా, మరోవైపు పది రోజుల పాటు ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లోనే విశ్రాంతి తీసుకుంటానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. ఈ పది రోజులు తనను డిస్టర్బ్ చేయొద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని అభిమానులు, కార్యకర్తలకు కవిత విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అభిమానులు సహకరించాలని కోరారు. పది రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. మరికాసేపట్లో కేసీఆర్‌తో కవిత భేటీ కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed