- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRSలో దూమారం రేపుతోన్న మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేసీఆర్ వార్నింగ్?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఈ సారి అధికారం తమదేనంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు ఇప్పుడే అసలైన పరీక్ష ఎదురైంది. జాతీయ పార్టీ ఆవిర్భావం తర్వాత ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన కేసీఆర్ ఇకపై ఏపీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సొంత పార్టీ నేతలకు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైం కావడం వల్ల పెద్దగా సమస్య కానప్పటికీ బీఆర్ఎస్ ఏపీలోనూ పాగా వేయాలని భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వివాద సమస్యలను లేవనెత్తకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరులను బీఆర్ఎస్ అగ్రనాయకత్వం హెచ్చరించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం హెచ్చరికలకు మరోసారి మంత్రి మల్లారెడ్డి కారణం కావడం హాట్ టాపిక్ గా మారింది.
మల్లారెడ్డి వ్యాఖ్యలతో అలర్ట్
ఇటీవల మంత్రి మల్లారెడ్డికి పార్టీ అధిష్టానానికి గ్యాప్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. సొంత జిల్లా ఎమ్యెల్యేలే మల్లారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేయడం గత నెలలో సంచలనంగా మారింది. మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అందువల్ల ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఏకంగా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం వినిపించారు. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక పార్టీ అధిష్టానం ఉందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలకు విరుద్ధంగా మల్లారెడ్డి వ్యవహరిస్తుండటంతోనే ఆయనపై ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసేలా పార్టీ పెద్దలే ప్రోత్సహించారనే ప్రచారం జరిగింది.
ఈ విషయం మరువక ముందే ఇటీవల మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి కారు పార్టీ పెద్దలకు ఇబ్బందికరంగా మారాయనే చర్చ జరుగుతోంది. ఏపీలో అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్ ద్వారా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మొదటికే మోసం చేసేలా ఉన్నాయని ఈ అంశంపై ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయతిస్తున్న తరుణంలో నేతలెవరూ రాష్ట్రాల మధ్య పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకువచ్చేలా వ్యాఖ్యలుచేయవద్దని పార్టీ నేతలకు హెచ్చరించారనే ప్రచారం జరుగుతోంది.
డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు
నిజానికి కేసీఆర్ ఏపీ రాజకీయ ప్రయత్నంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి ప్రజలు కేసీఆర్ ను ఏ మేరకు విశ్వసిస్తారనేది సవాలే. అయినా అక్కడి నేతలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో చెప్పే ప్రయత్నం చేస్తు్న్నారు. ఏపీలో రాజకీయం చేయాలని చూస్తున్న కేసీఆర్ అదే ఏపీ విభజన చట్టం విషయంలో అనేక సార్లు మోకాలడ్డుతున్నాడని ఏపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ వెళ్లడంపై తెలంగాణలోని ప్రతిపక్షాలు కేసీఆర్‌ను కార్నర్ చేస్తున్నారు. పోలవరాన్ని కేసీఆర్ పూర్తి చేస్తాడని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, కానీ 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను నిలదీయడం మొదలు పెట్టాయి. భద్రాచలం ముంపునకు గురవుతున్న బ్యాక్ వాటర్‌పై ఆందోళనలు చేస్తూ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఎనిమిదేళ్ల క్రితం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
గతేడాది జులైలో భద్రాచలం ముంపునకు పోలవరం ప్రాజెక్టే కారణం అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక పోలవరం ప్రాజెక్టుతో పాటు, హైదరాబాద్‌లో ఉన్న షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల విభజన, కృష్ణా, గోదావరి నీరు, విద్యుత్ బకాయిల పంచుకోవడం వంటి అనేక విభజన సంబంధిత అంశాలు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలను అపరిష్కృతంగా మారాయి. ఈ నేపథ్యంలో విభజన చట్టంలో సమస్యగా మారే అంశాలపై స్పందించకుండా పార్టీ నేతలను వీలైనంత కంట్రోల్ లో ఉంచుకోవాలని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారని ఇందులో భాగంగానే వారికి హెచ్చరికలు సైతం జారీ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడానికి కారణం అయిన కేసీఆర్‌ను ఏపీ ప్రజలు ఏ మేరకు అండగా నిలుస్తారో చూడాలి మరి.
Read more: