- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR వర్సెస్ తెలంగాణ ఆఫీసర్స్
దిశ, తెలంగాణ బ్యూరో : ఎంకిపెళ్ళి సుబ్బి చావు.. చందంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్లాన్ చేస్తుండగా ఆ రాష్ట్రంతో ఉన్న సమస్యలు, వివాదాల విషయంలో ఇకపైన ప్రభుత్వపరంగా ఎలాంటి వైఖరి వెల్లడించాలన్నది అధికారులకు సవాలుగా మారింది. పార్టీ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఒక వైఖరి వెల్లడించిన తర్వాత దానికి భిన్నంగా అధికారులుగా తాము మరో రకంగా వ్యాఖ్యానించలేమన్న గందరగోళం నెలకొన్నది. కృష్ణా జలాలు, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం, రాయలసీమలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, విభజన చట్టంలోని సమస్యలు.. ఇలా అనేకం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నందున వాటిపై ఇకమీద ఎలాంటి కామెంట్స్ చేస్తే ఏం ముంచుకొస్తుందోననే ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతున్నది.
ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఘర్షణ వాతావరణమే ఉన్నది. ఇటీవల ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో సైతం గోడెం కొత్తవాగు, మోడికుంటవాగు విషయాల్లో అనుమతుల్లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర జల సంఘం ఎప్పుడో నీటి లభ్యత, కేటాయింపుపై క్లారిటీ ఇచ్చిందని తెలంగాణ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చారు. చివరకు గోదావరి నీటి లభ్యతపైనా రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో అధ్యయనం కోసం కేంద్ర జల సంఘానికి నివేదించాలన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కృష్ణా జలాల విషయంలోనూ ఏపీ తన వాటాకు మించి వాడుకుంటున్నదని, బేసిన్ వెలుపలకు కూడా తరలిస్తున్నదని ఇంతకాలం తెలంగాణ విమర్శించింది.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు తదితరాలపై కూడా విమర్శించిన తెలంగాణ ఆఫీసర్లు ఎగువ రాష్ట్రమైనా నీటిని వాడుకోలేకపోతున్నామని వాపోయారు. ఇక విభజన చట్టంలోని అనేక వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ సంస్థల మధ్య బకాయిలపై ఇప్పటికీ వివాదం కంటిన్యూ అవుతున్నది. చట్టంలోని 9వ, 10వ షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాకపోగా పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగే పలు సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని అధికారులు స్పష్టంగానే చెప్పి ఏపీ ప్రభుత్వం వితండవాదానికి దిగుతున్నదనే విమర్శలు కూడా చేశారు. తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సైతం తెలంగాణపైన ఏపీ ప్రభుత్వం నిప్పులు చెరిగింది. తెలంగాణ సకాలంలో స్పందించని కారణంగానే, విధాన నిర్ణయాన్ని ప్రకటించనందునే వివాదాలకు పరిష్కారం లేకుండా పోయిందని సూటిగానే చెప్పింది.
ప్రభుత్వాలపరంగా రెండు రాష్ట్రాల మధ్య, అధికారుల మధ్య ఇలాంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాలపై ఆ రాష్ట్ర ప్రజలకు ఆగ్రహం కలగకుండా సాఫ్ట్ కార్నర్ తీసుకున్నందున ఇకపైన సమావేశాల్లో అధికారికంగా ఎలాంటి వైఖరి ప్రదర్శించాలన్నది ఆఫీసర్లకు గుదిబండలాగా మారింది. ఇంతకాలం అనుసరించిన వైఖరినే కొనసాగిస్తే పొలిటికల్ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారనే పేరుతో సీఎం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోననే గుబులుతో ఉన్నారు. ఒకవేళ సీఎం తరహాలోనే సాఫ్ట్ గా వెళ్తే ప్రభుత్వపరంగానే రాజీ పడిన అభిప్రాయం ఎస్టాబ్లిష్ అవుతుందేమోననే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో ఏ స్టాండ్ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే డైలమా వారిని వేధిస్తున్నది.
ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా రానున్న సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కో అంశంపైన ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, ఏ తరహా అభిప్రాయాలను వెల్లడించాలి, మీడియాతో ఎలాంటి వైఖరి అవలంబించాలి తదితరాలన్నింటినీ ముఖ్యమంత్రి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాల్సి వస్తుందనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. పొలిటికల్, అఫీషియల్ స్టాండ్లలో వేర్వేరు అభిప్రాయాలతో సరికొత్త విమర్శలకు లోనుకావాల్సి వస్తుందేమోననే ఆందోళనను కొద్దిమంది వ్యక్తం చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణతో అధికారులకు కక్కలేని, మింగలేని సరికొత్త సమస్య ఎదురవుతున్నది.
Also Read...