- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్.. స్టేట్ వైజ్ స్ట్రాటజీ! ఆ ఫలితాల తర్వాత రంగంలోకి..
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెబుతున్న గులాబీ అధినేత కేసీఆర్.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో సైలెంట్‌గా ఉంటున్నారు. ఇంతవరకు ఏపీలో ఎంటర్ కాకుండానే, అక్కడి ప్రజలను ఆకర్షించేందుకు ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ అంశాన్ని సెంటిమెంట్‌గా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని మహారాష్ట్రలో యాక్టివిటీస్‌ను ముమ్మరం చేశారు. జాయినింగ్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.
కర్ణాటకలో ప్రచారానికి దూరమేనా?
కొన్ని నెలల క్రితం వరకు జేడీఎస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహం మంచిగానే సాగింది. పలు బీఆర్ఎస్ పొగ్రామ్స్‌కు ఆ పార్టీ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు. ఆ సమయంలో జేడీఎస్‌కు మద్దతుగా అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ తీరా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాత్రం కేసీఆర్ అటువైపు చూడటం లేదు. అయితే ఆ పార్టీతో కేసీఆర్‌కు విభేదాలు వచ్చి ఉంటాయేమోనని, అయితే కారణాలు ఎవరికీ తెలియవని పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతున్నది.
మహారాష్ట్రలో జోష్
ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా మహారాష్ట్రలో మాత్రం పార్టీని విస్తరించడంపై కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రెండు బహిరంగ సభలు నిర్వహించారు. మరో పబ్లిక్ మీటింగ్‌కు రెడీ అయ్యారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే ఇదంత అక్కడ జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సిద్ధంగా లేదనే వార్తలు వస్తున్నాయి.
ఏపీలోకి ఎంట్రీ కాలే
పొరుగున ఉన్న ఏపీలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ అంశంతో అక్కడ అడుగు పెట్టాలో ఆలోచిస్తున్నారు. అయితే వైజాగ్ స్టీల్ టెండర్లలో భాగస్వామి అయితే బీఆర్ఎస్‌కు అక్కడ ప్రజల నుంచి సానుభూతి వస్తుందనే అంచనాతో హడావిడి చేశారు. కానీ అక్కడికి వెళ్లి పబ్లిక్ మీటింగ్ నిర్వహించేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయా? ప్రజలు వస్తారా? అనే అనుమానాలు కేసీఆర్‌కు ఉన్నట్టు తెలిసింది. అందుకే ఏపీ పార్టీ కమిటీని ప్రకటించినా అక్కడికి వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
కర్ణాటక రిజల్ట్ తర్వాతే ఢిల్లీ టూర్..
బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన తర్వాత కేసీఆర్ మళ్లీ ఢిల్లీకి వెళ్లలేదు. నెల రోజుల క్రితం ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు లీకులు ఇచ్చారే తప్పా అటు వైపు చూడలేదు. ఈలోపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కుమార్తె కవిత విచారణ ఎదుర్కోవడంతో ఢిల్లీ టూర్ ఊసే ఎత్తలేదు. కర్ణాటక రిజల్ట్ తర్వాత కేసీఆర్ మళ్లీ ఢిల్లీ టూర్ ఉండే చాన్స్ ఉందని పార్టీ లీడర్లు చెబుతున్నారు.