- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ ఖాసీం రజ్వీ: Bandi Sanjay
దిశ,ముధోల్ : కేసీఆర్ అంటే కల్వకుంట చంద్రశేఖర్ రావు కాదని ఖాసీం చంద్రశేఖర్ రజ్వి అని బండి సంజయ్ ఆరోపించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా నాలుగో రోజు నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. అనంతరం బండి మాట్లాడుతూ.. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త బిల్డింగ్‌లను కట్టడంలోనూ సర్కార్ విఫలమయిందన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాద్యాయులు బండి సంజయ్‌కి వినతి పత్రం అందించారు. గ్రామంలోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామాలలో ఇప్పటికి డబుల్ బెడ్ రూంలు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ అణగదొక్కుతున్నాడన్నారు. నిన్న బాసర ట్రిపుల్ ఐటీలో 80 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు విని బాధపడ్డానని అన్నారు. పాదయాత్రలో జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, తాలూకా యాత్ర ప్రముఖ్ మోహన్ రావు పటేల్, బీజేపీ నాయకులు రామారావు పటేల్ తదితరులు ఉన్నారు.
Read More.....