- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Erravalli: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్(KCR) సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. సభలో ప్రభుత్వంపై ఇరుకున పెట్టే వ్యహాలను సూచించారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను అసెంబ్లీలో ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. హైడ్రా, లగచర్ల ఘటనలపై కూడా ప్రశ్నించాలని చెప్పారు. కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao), పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, గంగుల కమలాకర్, చింత ప్రభాకర్, సుధీర్ రెడ్డి, అనిల్ జాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, మానిక్ రావ్, వివేక్ మందా గౌడ్, బండారు లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు.
పాల్గొన్న ఎమ్మెల్సీలు :
కల్వకుంట్ల కవిత, సుంకరి రాజు, షేర్ సుభాష్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, యాదవ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మధుసూదనా చారి, మహ్మూడ్ అలీ, ఎమ్మెల్సీ రమణ, దేశపతి శ్రీనివాస్, మధుసూదన్ టాటా, వాణి దేవి, రమణా రెడ్డిలు హాజరయ్యారు.