KCR: కేసీఆర్ గప్‌చుప్! పార్లమెంట్ సమావేశాలపై నో కామెంట్స్.. ఎందుకు?

by Ramesh N |
KCR: కేసీఆర్ గప్‌చుప్! పార్లమెంట్ సమావేశాలపై నో కామెంట్స్.. ఎందుకు?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్డీయే కూటమి మూడోసారి కొలువుదీరాక తొలిసారి బడ్జెట్ సమర్పించేందుకు పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. అయితే ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారు. గతంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయంటే పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించేవారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేసేవారు. కేంద్ర వైఖరిపై సభలో వారు మాట్లాడాల్సిన విషయాలపై గతంలో చర్చించేవారు. అయితే ఇప్పుడు కేసీఆర్ గప్‌చుప్‌గా ఉండటం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.

రాజ్యసభలో నలుగురు సభ్యులు..

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉండటంతో బీఆర్ఎస్ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ వారికి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయకుండా సైలెంట్‌ ఎందుకు ఉన్నారన్న చర్చ సాగుతోంది. రాజ్యసభ సభ్యులు తెలంగాణకు రావాల్సిన నిధులపై ఏమి ప్రశ్నిస్తారు? అని డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీ రాజ్యసభ పక్షంలో విలీనం కానుందా? అనే ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని టాక్ సైతం వినిపించింది. ప్రస్తుతం మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటెరో పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్‌రావు బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనా కేసీఆర్ మౌనం వీడకపోవడంపై చర్చ సాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed