కేసీఆర్ తాగుతున్నది గ్రీన్ టీ నే! సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం!

by Disha Web Desk 14 |
కేసీఆర్ తాగుతున్నది గ్రీన్ టీ నే! సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ యాత్ర బస్సులో ఉండగా ఓ నిండు గ్లాస్ తన పక్కనే కన్పించింది.. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాయి. నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఓ హోటల్ వద్ద ఆగినప్పుడు కేసీఆర్ గ్రీన్ టీ తాగుతుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నడిచిందని పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు పార్టీ శ్రేణులు విడుదల చేశాయి. కేసీఆర్ తాగుతున్నది గ్రీన్ టీ నే అని స్పష్టం చేశాయి.

కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కేసీఆర్ గ్రీన్ టీ తాగే ఫోటోపై ఫేక్ ప్రచారం చేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాగా, కేసీఆర్ బస్సు యాత్ర ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపు( 3 వ తేదీన) సాయంత్రం 8 గంటల వరకు గడువు ముగియనుంది. అయితే గడువు ముగిసిన 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో గతంలో ప్రకటించిన విధంగా యధావిధిగా కొనసాగుతున్నట్లు పార్టీ శ్రేణుల సమాచారం.

Next Story

Most Viewed