- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ’
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న నిరంకుశ, మాఫియా పాలనను అంతం చేయడానికి ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నారని అందువల్ల కేసీఆర్ పై ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే బాగుంటుందనే ఆలోచన ఉందన్నారు. నిజానికి ఇది గద్దర్ ఆలోచన అని చెప్పారు. గురువారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన పొత్తులపై ప్రతిపక్షాల మధ్య సాగదీత ఉండవద్దని సూచించారు బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటే అని తేలిపోయిందని కేసీఆర్ చేతిలో మోసపోయిన కమ్యూనిస్టులంతా ఏకం కావాలన్నారు. వచ్చే ఎన్నిక్లలో టీజేఎస్ తప్పకుండా పోటీ చేస్తుందన్నారు. పోటీ చేయడానికే పార్టీ పెట్టుకున్నామన్నారు. కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వెనుక ఎలాంటి దూకుడు లేదని అంతా భయమే ఉందన్నారు. అందరం కేసీఆర్ ను నమ్మి మోసపోయామని మళ్లీ మళ్లీ మోసవద్దనేదే తమ ఉద్దేశమన్నారు. అందుల్లే విపక్షాలు సంఘటితమై కేసీఆర్ ను ఎదుర్కోంటే తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.