‘రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగవి నువ్వు’.. మొదటిసారి CM రేవంత్‌పై రెచ్చిపోయిన KCR

by Anjali |
‘రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగవి నువ్వు’.. మొదటిసారి CM రేవంత్‌పై రెచ్చిపోయిన KCR
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెచ్చిపోయారు. శనివారం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికావు అని అన్నారు. ఆ కేసులు బయటకు తీస్తే నువ్వు బీజేపీలోకి పోతావు అంటూ ఫైర్ అయ్యారు. మా పార్టీలోని ముఖ్య నేతలను కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి మేము 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని చెప్పుకొచ్చారు. మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అని అంటున్నారని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేసి మాట్లాడారు. చూద్దాం ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి ఎమ్మెల్యేలు పోతారో అని కేసీఆర్ రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చాడు.

చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా కార్యక్రమాలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని, వారి తప్పులే లోక్‌సభ ఎన్నిక్లలో ఆ పార్టీని కాటేయబోతున్నదని అన్నారు. తాము పదేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దిన రాష్ట్రంలో అతితక్కువ కాలంలోనే రైతులు, కార్మికులు, చేనేతలు, దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వారి ఆగ్రహం చవిచూడబోతున్నదని ఇదే ఈ విషయం తన బస్సు యాత్రలో కనిపించిందని చెప్పారు.

ఈ ప్రభుత్వం రావడమే మాకు శాపంగా మారిందని రైతులు బాధపడే పరిస్థితికి వచ్చారు. రైతుబంధు వేయలేదని, బోనస్ రూ.500 ఎగబెట్టారు. బోనస్ అనేది బోగస్ అయిందని ధ్వజమెత్తారు.రైతు రుణమాఫీ చేయడం భ్రమ అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. తాను గతంలో రుణమాఫీ చేయడం కోసం చేయని ప్రయత్నం లేదన్నారు. తాము అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం. కానీ మేము అధికారంలో నుంచి దిగిపోగానే రాష్ట్రమంతటా కట్క బంద్ చేసినట్లుగా కరెంట్ పోవడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement

Next Story