ఏ పిచ్చి ముఖ్యమంత్రి అలా చెప్పడు.. రేవంత్ రెడ్డిపై KCR ఫైర్

by Satheesh |   ( Updated:2024-05-11 09:00:41.0  )
ఏ పిచ్చి ముఖ్యమంత్రి అలా చెప్పడు.. రేవంత్ రెడ్డిపై KCR ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సరూర్ నగర్ కాంగ్రెస్ సభకు కనీసం 3 వేల మంది కూడా రాలేదు.. సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధిపై తక్కువ దృష్టి పెట్టిందని, కాంగ్రెస్ చేసిన తప్పులే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాటేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల్లో లేదని అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పారని, అలా చెప్పడం వల్ల స్టేట్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని అభిప్రాయం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమూల్యమైన సమయాన్ని కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు వాడుకుందని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో కరెంట్ కోతలు వర్ణనాతీతమని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కారించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంటుదని హెచ్చరించారు. ప్రజాగ్రహం కాంగ్రెస్‌ను వెల్లువలా ముంచేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed