- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఏం చేయలేరు.. KCR ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎగబెట్టాలని చూస్తుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. రైతుబంధును తాము ఏడాదికి 15 వేల కోట్లు వేసేవాళ్ళమని వెల్లడించారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్న రైతు భరోసాతో సంవత్సరానికి రూ.21, రూ.22 వేల కోట్లు అవుతాయని తెలిపారు. కానీ ఇవ్వే ఇవ్వలేకపోతున్నరు.. అవేమీ ఇస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రైతుబంధు ఎగబెట్టడానికే సాగు చేసిన వాళ్లకే రైతుబంధు ఇస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని పేర్కొన్నారు. పంటసాగు చేస్తున్నట్లు సర్టిఫికెట్ ఏఈఓ, వీఆర్ఓ ఇవ్వాలని.. వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం అడుగుతారని అన్నారు. లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి వెంట్రుక మందం కూడా ఫరక్ పడదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఒక మహా సముద్రమని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని వెల్లడించారు.