కవితకు బిగ్ షాక్ ఇచ్చిన KCR.. నిజామాబాద్ MP టికెట్ మరొకరికి కేటాయింపు

by Satheesh |   ( Updated:2024-03-13 16:17:59.0  )
కవితకు బిగ్ షాక్ ఇచ్చిన KCR.. నిజామాబాద్ MP టికెట్ మరొకరికి కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాసేపటికే.. నిజామాబాద్, జహీరాబాద్ లోక్ సభ స్థానాలకు క్యాండిడేట్ల పేర్లను అనౌన్స్ చేశారు. నిజామాబాద్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి గాలి అనిల్ కుమార్ పేర్లను కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 17 స్థానాలకు గానూ బీఆర్ఎస్ ఇప్పటి వరకు 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాగా, తన కూతురు, ఎమ్మెల్సీ కవిత సిట్టింగ్ స్థానాన్ని కేసీఆర్ మరొకరికి కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది.

కవిత సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్‌ను బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డికి కేటాయించడంతో కవిత ఎక్కడ పోటీ చేస్తారోననే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు కవిత పోటీ చేస్తారా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై గులాబీ బాస్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడితే పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండటంతో కేసీఆర్ తనదైన శైలీలో వ్యుహాలు రచిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని నిరూపించుకోవాలని గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తున్నారు.

Advertisement

Next Story