- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత.. అఫిషియల్‌గా ప్రకటించిన కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ అనౌన్స్ చేశారు. పార్టీ ముఖ్య నేతలు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని బుధవారం కేసీఆర్ ఖరారు చేశారు. కాగా, దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. లాస్య నందిత అకాల మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. ఈసీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే మే 13వ తేదీన కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరగనుంది. ఈ క్రమంలో కేసీఆర్ కంటోన్మెంట్ నుండి మరోసారి సాయన్న ఫ్యామిలీకే టికెట్ కేటాయించారు. సాయన్న చిన్న కూతురు, ఎమ్మెల్యే లాస్య సోదరి నివేదికు టికెట్ ఇచ్చారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవల బీజేపీ నుండి కాంగ్రెస్‌లో చేరిన శ్రీ గణేష్‌కు టికెట్ ఇచ్చింది. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి పేరును అనౌన్స్ చేయాల్సి ఉంది.