- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌కు కేసీ వేణుగోపాల్.. స్వాగతం పలికిన రేవంత్, భట్టి
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కలు స్వాగతం పలికారు. కాసేపట్లో కొంగర కలాన్, ఎల్బీస్టేడియంలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత 7.30 తాజ్‌కృష్ణ హోటల్‌లో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌లో భాగస్వామ్యం కానున్నారు. దీంతో పాటు ఇదే హోటల్‌లో టీపీసీసీ కీలక నాయకులతోనూ భేటీ కానున్నారు. సీడబ్ల్యూసీ, సభ, ఎన్నికల అభ్యర్ధుల ఎంపికలపై చర్చించనున్నారు.
ఒక్కో లీడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. జన సమీకరణ, సభ సక్సెస్‌పై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇక ఈ రెండు మీటింగ్‌లు పూర్తయిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో కేసీ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. అభ్యర్ధుల ఎంపిక అంశాలపై మాట్లాడనున్నారు. దీంతో పాటు ఇవాళ రాత్రి లేదా రేపు కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో చేరాలని భావిస్తున్న లీడర్ల ఫర్మామెన్స్, ప్రజాధరణపై చర్చించనున్నారు.
కోమటి రెడ్డి అంశం కొలిక్కి వచ్చేనా..?
ఎంపీ కోమటి రెడ్డికి జాతీయ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో ఎలాంటి పదవులు రాకపోవడంతో ఆయన పార్టీపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన గాంధీభవన్‌లో గడిచిన మూడు రోజులుగా జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌లకు హాజరు కాలేదు. అంతేగాక తాజ్ కృష్ణలో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ కీలక సమావేశంలోనూ ఆయన పాల్గొనలేదు.
అసంతృప్తితో ఉన్నట్లు రాష్ట్ర పార్టీ ద్వారా సమాచారం తెలుసుకున్న కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డికి నేరుగా ఫోన్ చేశారు. తనను కలవాలని కేసీ ప్రత్యేకంగా కోరినట్లు తెలిసింది. దీంతో కోమటిరెడ్డి, కేసీ వేణుగోపాల్ ఓ ప్రైవేట్ హోటల్‌లో కలవనున్నట్లు ఓ సీనియర్ నేత తెలిపారు. కోమటి రెడ్డిని బుజ్జగించడంతో పాటు సీడబ్ల్యూసీ మీటింగ్‌పై చర్చించనున్నారు.