- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇది దేశంలోని ప్రతి మహిళ సాధించిన విజయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన కవిత
X
దిశ, వెబ్‌డెస్క్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నందున, ఇది మన దేశంలోని ప్రతి ఒక్క మహిళ సాధించిన ముఖ్యమైన విజయం. మన దేశ పౌరులందరికీ, సోదరీమణులు, సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’ అంటూ కవిత ట్వీట్ చేశారు. లోక్‌సభలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున, ఈ బిల్లు ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరగేలా చూడాలని కవిత ఆకాంక్షించారు. మరోవైపు కవిత ఇంటి వద్దకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీగా చేరుకోని సంబురాల్లో మునిగిపోయారు.
Advertisement
Next Story