- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘‘కవితక్క.. మహిళా రిజర్వేషన్ బిల్లు ముచ్చటేమైంది?’’.. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం
దిశ, డైనమిక్ బ్యూరో: చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌పై గళం విప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ విషయంలో సైలెంట్ కావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ గత మార్చిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన కవిత ఆ తర్వాత కొంత కాలం హడావుడి చేసినా ప్రస్తుతం మౌనం దాల్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన సందర్భంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కవిత ప్రకటించారు.
ఈ మేరకు దేశంలోని పలువురు మేధావులకు పోస్టు కార్డు రాయడం, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, మిస్డ్ కాల్స్ కార్యక్రమాలు చేపట్టేలా రూట్ మ్యాప్‌ను సైతం సిద్ధం చేసి కార్యచరణను ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయాన్ని కవిత పక్కన పెట్టేశారని ప్రతిపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్ ముచ్చట ఏమైందని బీజేవైఎం నేతలు సోషల్ మీడియా వేదికగా కవితను నిలదీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకే కవిత మహిళా బిల్లు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం కవిత అంశం కాస్త సైలెంట్ కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును సైతం చర్చ జరగడం లేదు. దీంతో ఇది ముగిసిన ముచ్చటేనా? లేక దర్యాప్తు సంస్థల నుంచి తదుపరి నోటీసు అందితే మాత్రమే ఈ అంశంపై మాట్లాడుతారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నెటిజన్ల ప్రశ్నలకు కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read More: శేరిలింగంపల్లి నుండి బరిలోకి ‘‘బండి’’.. BRS అధిష్టానం ఆశీస్సులు కూడా ఆయనకే..?