నేడు చెన్నైకి కవిత.. 2024 ఎన్నికల విషయంలో MLC స్పందనపై ఉత్కంఠ!

by Satheesh |   ( Updated:2023-02-10 06:44:18.0  )
నేడు చెన్నైకి కవిత.. 2024 ఎన్నికల విషయంలో MLC స్పందనపై ఉత్కంఠ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలని ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో పర్యటించబోతున్నారు. తొలుత నటుడు అర్జున్ చెన్నైలో నిర్మించిన ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహిస్తున్న కార్యక్రమంలో '2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు?' అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొంటారు. ఈ చర్చా వేదికలో కవితతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలపై కవిత ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరచబోతున్నారనేది ఆసక్తిగా మారింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్రంట్‌లు, పొత్తులు వంటి అంశాలపై ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.

Advertisement

Next Story