- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌశిక్ రెడ్డి Vs ప్రణవ్ బాబు.. చేల్పూర్‌లో హై టెన్షన్!
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ మండలంలోని చెల్పూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి ప్రణవ్ బాబులు ఛాలెంజ్ చేసుకుని వేదిక చేసుకున్న హనుమాన్ దేవాలయం వద్ద 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు. హుజురాబాద్, జమ్మికుంట రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎవ్వరినీ అక్కడికి రానీయడం లేదు.
గుడి చుట్టూ పోలీసులు మోహరించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడకు రాకుండా నిఘా పెట్టారు. కాగా మంగళ వారం ఉదయం గుడి వద్ద ప్రమాణం చేయాలి అని ఛాలెంజ్ చేసుకుని సిద్ధపడ్డ తరుణంలో రాత్రికి రాత్రే కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని, మానుకోటలో రాళ్ళు విసిరిన ద్రోహి అంటూ పోస్టర్లు వెలువడం చర్చనీయాంశంగా మారింది.
నాయకులను హౌజ్ అరెస్ట్ చేశాం.. ఎవరూ ఇక్కడకు రావద్దు.. ఏసీపీ శ్రీనివాస్
హుజురాబాద్ నియోజక వర్గంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరు పార్టీల నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం జరిగిందని, కార్యకర్తలు ఎవ్వరూ ఇక్కడకు రావద్దని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. పోలీసులు పలువురిపై నిఘా పెట్టడం జరిగిందని, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేసినా కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు.