Kasam Venkateshwarlu: రాజీవ్ గాంధీ బతికే ఉంటే కాంగ్రెస్ పాలన చూసి ఏడ్చేవారు: కాసం వెంకటేశ్వర్లు

by Prasad Jukanti |   ( Updated:2024-12-31 12:24:00.0  )
Kasam Venkateshwarlu: రాజీవ్ గాంధీ బతికే ఉంటే కాంగ్రెస్ పాలన చూసి ఏడ్చేవారు: కాసం వెంకటేశ్వర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రుణమాఫీ పేరుతో కోఆపరేటివ్ సొసైటీలలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని టీబీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు (Kasam Venkateshwarlu) ఆరోపించారు. రుణమాఫీకి రూ. 41 వేల కోట్లు అవసరం అవుతుందని బడ్జెట్ లో చూపించి చివరకు రూ.22 కోట్లు మాత్రమే చేశారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణని కాంగ్రెస్ (Congress) పాలనలో రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) మాటకు విలువ లేకుండా పోయిందని పార్లమెంట్ కు ఎంత అధికారం ఉంటుందో స్థానిక సంస్థలకు అంతే అధికారం ఉండేలా రాజీవ్ గాంధీ చట్టసవరణ చేస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా రాజీవ్ గాంధీ ఆశయాలను నీరుగారుస్తోందని ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ బతికే ఉంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలననును చూసి కంటతడి పెట్టేవారన్నారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు కంటికి కూడా కనిపించడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ జీతం నుంచి గ్రామ పంచాయతీలకు ఖర్చు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం అవినీతి కక్కిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed