- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ తోనే మహిళా సాధికారత : చొప్పదండి ఎమ్మెల్యే
దిశ, గంగాధర: మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం కొండయ్య పల్లి గ్రామంలో మా ఊరు మహా లక్ష్మి ఫౌండేషన్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని పది మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేల ఫిక్స్ డిపాజిట్లను సోమవారం రోజున చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై డిపాజిట్ బాండ్లను అందజేశారు. మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ తరపున కొండయ్య పల్లి గ్రామంలో పుట్టిన ఆడపిల్లలకు గత ఏడు సంవత్సరాలుగా ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ లను చేస్తున్నట్లు రేండ్ల శ్రీనివాస్ పద్మ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో పాటుగా, 500 కి వంట గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా మా ఊరి మహాలక్ష్మి ట్రస్ట్ ఫౌండర్ రేండ్ల శ్రీనివాస్ పద్మను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, వేముల భాస్కర్, జాగరపు శ్రీనివాసరెడ్డి, సత్తు కనకయ్య దుబ్బాసి బుచ్చయ్య, బూర్గు గంగన్న, రెండ్ల రాజిరెడ్డి, అట్లా రాజిరెడ్డి దోర్నాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.