వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే రసమయి

by Shiva |
వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే రసమయి
X

దిశ, శంకర పట్నం: కేశవపట్నంలో వెలసిన కాకతీయుల కాలంనాటి పురాతన దేవాలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తానని, రాష్ట్ర సాంస్కృతిక రథ సారథి, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ హామీ ఇచ్చారు. శనివారం ఎమ్మెల్యే వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం మరుగునపడి ఆదరణకు నోచుకోవడం శోచనీయం అన్నారు.

ఇప్పటికైనా.. కమిటీ సభ్యులు ముందుకు వచ్చి పునర్నిర్మాణానికి నడుం బిగించడం అభినందనీయం అన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రసమయికి వినతిపత్రం అందజేశారు. అనంతరం.. ఎమ్మెల్యే హైదరాబాద్ ఎండోమెంట్ విభాగం కమిషనర్ అనిల్ కుమార్ కు ఫోన్ చేసి వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి త్వరితగతంగా సీజీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ పులికోట రమేష్, ఎంపీటీసీ బొజ్జ కవిత, ఉపసర్పంచ్ హనుమంతు, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు గుర్రం రామస్వామి, అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోపు శ్రీనివాసరెడ్డి, నాయకులు, ఉమ్మెంతల సతీష్ రెడ్డి, బండారి తిరుపతి, బొజ్జ కోటిలింగం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed