- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేర్వేరుగా ఎన్నికలొస్తే.. కరీంనగర్ నుంచే పోటీ చేస్తా: ఎంపీ బండి సంజయ్
దిశ, కరీంనగర్: ఊహాగానాలకు తెరపడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కుమ్మక్కైనట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. కొంతమంది మూర్ఖులు కావాలని చేస్తున్న దుష్ప్రచారంలో భాగమేనన్నారు. తాను దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం ప్రజా సమస్యలపై కొట్లాడే వ్యక్తినే తప్ప కుమ్మక్కు రాజకీయాలు తనకు తెలియదని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేసే మూర్ఖులకు దమ్ముంటే తనతో నేరుగా కొట్లాడాలని సూచించారు. తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం, అమెరికా పర్యటనలో ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయానని చెప్పారు. గురువారం బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని, కార్యకర్తలపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేస్తున్న దీక్షతో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ చేసిన మోసాల బండారం బయటపడుతుందనే భయంతోనే దీక్ష భగ్నం చేశారని మండిపడ్డారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల పొట్ట కొడుతోందని, ఉద్యోగాలు రిటైర్డ్ బెన్ ఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవనే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారు. ప్రభుత్వ భూములు అమ్మి జీతాలిచ్చే దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. రాష్ట్రాన్ని 5.5 లక్షల కోట్ల అప్పులపాలు చేశారు. కేసీఆర్ చెల్లని రూపాయిలా మారారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే అప్పులెలా తీరుస్తారో సమాధానం చెప్పాలి? కేసీఆర్‌కు బీజేపీ అంటేనే భయం వేస్తోంది. అందుకే కాంగ్రెస్‌ను జాకీ పెట్టి లేపే కుట్ర చేస్తున్నడు. కాంగ్రెస్ ఎలాగో అధికారంలోకి రాదు. అందుకే అడ్డగోలు హామీలతో ఆకట్టుకోవాలనుకుంటున్నారు.
రాష్ట్రంలో కౌలు రైతుల గురించి ఎందుకు ఏ పార్టీ పట్టించుకోవడం లేదు? అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కేంద్రాన్ని బదనాం చేయడం, మోసపూరిత హామీలు ఇవ్వడం, కాంగ్రెస్ ఇమేజ్ పెంచడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నడే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఒవైసీ చెబితేనే సెప్టెంబర్ 17 తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవంగా కేసీఆర్ ప్రకటించారు. ఒవైసీతో ప్రేమ చిహ్నానికి గుర్తుగా దారుస్సలాంలో జాతీయ సమైక్యతా ఉత్సవాలు చేసుకోండి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపి తీరాల్సిందే. కేసీఆర్‌కు చేతకాకపోవడంవల్లే కేంద్రమే అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తోంది.
జమిలి ఎన్నికలంటే బీఆర్ఎస్ నేతలకు భయమెందుకు? మోదీ చరిష్మా ముందు బీఆర్ఎస్ వన్నీ నల్ల ముఖాలే. జమిలీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు కూడా రావు. జమిలీ ఎన్నికలపై అధికారిక నిర్ణయం వెలువడకముందే ఎందుకంత తొందర? నేను కోర్టుకు హాజరయ్యే విషయంలో మూడు సార్లు వాయిదా కోరిన మాట వాస్తవం. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పుడు ఎలా హాజరవుతా? అమెరికాలో ఉన్నప్పుడు ఎలా హాజరవుతా? నోటికొచ్చినట్లు మాట్లాడేటోళ్లను పట్టించుకోను. నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో నాకు క్లారిటీ ఉంది. ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే నేను కరీంనగర్ అసెంబ్లీ నుండే పోటీ చేస్తా. కరీంనగర్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు హేయనీయం. కరీంనగర్‌లో గంజాయి ఏరులై పారిస్తూ యువతను చిత్తు చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అధికార పార్టీ నేతలే గంజాయిని ఏరులై పారిస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు.
పోలీసులు గంజాయిని కంట్రోల్ చేస్తారా? లేదా? ... లేనిపక్షంలో మేమే యువకులతో దళాలను (టీంలను) ఏర్పాటు చేసి గంజాయి అమ్మేటోళ్లను పొట్టుపోట్టుగా కొట్టిస్తా. చిన్న చిన్న పిల్లలను కూడా గంజాయికి అలవాటు చేస్తే చూస్తూ ఊరుకుంటారా? మీ పిల్లలు గంజాయికి అలవాటైనా ఇట్లనే మౌనంగా ఉంటారా? నాతో సహా బీజేపీ నేతలంతా దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తాం. గంజాయి అమ్మకాల్లో ఏ పార్టీ నాయకులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అధికార పార్టీ నేతలు పైసలతో నాయకులను, ఓట్లను కొంటున్నారు. పైసలకు తాత్కాలికంగా అమ్ముడు పోయిన వాళ్లంతా త్వరలోనే వాస్తవాలు తెలుసుకుంటారు. వాళ్లంతా తిరిగి మాతోనే రావడం ఖాయం...
చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే ఆయనపై చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా పనేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతగా ఉన్న నాయకుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదు. కక్ష పూరితంగా అరెస్ట్ చేశారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును ఆదరాబాదరాగా అరెస్ట్ చేయడంతో టీడీపీ ఇమేజ్ పెరిగింది. పార్టీలతో సంబంధం లేని ప్రజలు కూడా చంద్రబాబు అరెస్ట్‌ను తప్పు పడుతున్నారని గుర్తుంచుకోండి. వాస్తవాలు మాట్లాడితే తమను చంద్రబాబు ఏజెంట్ గానో, పవన్ ఏజెంట్ గానో ప్రచారం చేయడం వైఎస్సార్సీపీ నేతలకు అలవాటైంది. ఇది కరెక్ట్ కాదు.. వైఎస్సార్సీపీ నేతలు ఇకనైనా తమ తప్పులను సరిదిద్దుకుంటే ఆ పార్టీ గ్రాఫ్ ప్రజల్లో పెరుగుతుందని కరీంనగర్ బండి సంజయ్ కుమార్ అన్నారు.