- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దుకాణాల సముదాయం ప్రారంభమెప్పుడో ?
గోదావరిఖని నగరం నడిబొడ్డున నగర పాలక సంస్థ దుకాణాల సముదాయాల నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. రూ.12 కోట్ల వ్యయంతో 72 విశాలమైన గదులు, రెండు అంతస్తులతో మున్సిపల్ కాంప్లెక్స్ సుందరంగా నిర్మించారు. ఏళ్లు గడస్తున్నా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కాంప్లెక్స్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా పడి ఉంది. కాంప్లెక్స్ ప్రారంభం నోచుకోకపోవడంతో రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా , అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనం ఆలనాపాలనా ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని పట్టించుకోకపోవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం వృథా అయితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మరో వైపు ఆ దారి గుండా మహిళలు, విద్యార్ధినిలు వెళ్లడానికే జంకుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రామగుండం అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పులో దుకాణాలు కోల్పోయిన మొబైల్ షాప్, టీ, కూలర్ దుకాణాదారులకు కాంప్లెక్స్ లో దుకాణాలు కేటాయించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దిశ, గోదావరిఖని : గోదావరిఖని నగరం నడిబొడ్డున అట్టహాసంగా రూ.12 కోట్ల వ్యయంతో 72 విశాలమైన గదులు, రెండు అంతస్తులతో సుందరంగా నిర్మించిన మున్సిపల్ కాంప్లెక్స్ ప్రారంభం కోసం ఎదురుచూస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపారస్తుల కోసం నిర్మించిన నూతన మున్సిపల్ కాంప్లెక్స్ ప్రధాన చౌరస్తాకు సమీపంలో నిర్మించిన నూతన మున్సిపల్ కాంప్లెక్స్ ప్రారంభానికి నోచుకోక రూ.12 కోట్లు వృధా అవుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
మందుబాబులకు అడ్డా..
నూతన మున్సిపల్ కాంప్లెక్స్ ప్రారంభం నోచుకోకపోవడంతో రాత్రివేళలో మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఆ దారి గుండా మహిళలు, విద్యార్థులు వెళ్లడానికి కూడా జంకుతున్నారు. అంతేకాకుండా పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
తహశీల్ధార్ కార్యాలయాన్ని తరలించాలి..
రామగుండంలోని తహశీల్ధార్ కార్యాలయాన్ని నూతన మున్సిపల్ కాంప్లెక్స్ లోకి తరలిస్తే స్థానిక ప్రజల అవసరాలు ఉపయోగంగా ఉంటుందని, దూర భారం తగ్గుతుందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. తహశీల్ధార్ కార్యాలయాన్ని తరలిస్తే నూతన మున్సిపల్ కాంప్లెక్స్ వినియోగంలోకి వస్తుందని, వీటితో పాటు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు నూతన మున్సిపల్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేయడం వల్ల నూతన మున్సిపల్ కాంప్లెక్స్ వినియోగంలోకి రావడమే కాకుండా.. ప్రజల సేవలకు ఉపయోగంగా ఉంటుందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ చొరవతో అతి త్వరలో నూతన మున్సిపల్ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
దుకాణాలు కేటాయించాలి..
రామగుండం అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పులో దుకాణాలు కోల్పోయిన మొబైల్ షాప్, టీ, కూలర్ దుకాణదారులు పాటు మరికొందరు వ్యాపారస్తులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ నూతన మున్సిపల్ కాంప్లెక్స్ లో దుకాణాలు కేటాయించేలా కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.