- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral : డేంటింగ్ చేస్తే శాలరీ డబుల్..! ఓ కంపెనీ బంపరాఫర్!!
దిశ, ఫీచర్స్ : వర్క్ ప్లేస్‌లో పని తప్ప టైంపాస్ వ్యవహారాలేవీ ఉండకూడదని రిక్రూటర్లు చెప్తుంటారు. ముఖ్యంగా లవ్, ఎఫైర్స్, డేటింగ్(dating) వంటి అంశాలకు అక్కడ ఏమాత్రం అవకాశం ఉండకూడదని హెచ్చరిస్తుంటారు. పైగా ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా తమ పని తాము చేసుకుపోయే వారినే క్రమ శిక్షణ కలిగిన ఎంప్లాయీస్‌గా భావిస్తుంటాయి ఎక్కవశాతం కార్పొరేట్ సంస్థలు లేదా కంపెనీలు. కానీ చైనాలోని ఓ సంస్థ (A company in China) మాత్రం ఇందుకు భిన్నంగా వెరైటీ డెసిషన్ తీసుకుంది. తమ వద్ద పనిచేసే వారు ఉద్యోగంతోపాటు నచ్చిన వ్యక్తితో డేటింగ్ చేసుకోవచ్చని, పైగా అలా చేసేవారికి డబుల్ శాలరీ ఇస్తామని బంపరాఫర్ ప్రకటించింది. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
వైరల్ సమాచారం ప్రకారం చైనాకు చెందిన ఓ సంస్థ పెళ్లి కాని ఉద్యోగులకు వినూతర్న రీతిలో బంపరాఫర్ అనౌన్స్ చేసింది. మ్యారేజ్ కానటువంటి ఎంప్లాయీస్‌లో వర్క్ ప్రొడక్టివిటీ పెంచేందుకు డేటింగ్ అవార్డును ప్రకటించింది. డబ్బులిచ్చి మరీ డేటింగ్ చేసుకోండని బ్యాచిలర్ ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. అలా చేసేవారికి డబుల్ శాలరీ కూడా ఇస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే ఎవరైనా ఒక ఉద్యోగి డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపే ఓ ఫొటోని సంబంధిత సంస్థకు చెందిన ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్(Online dating platform)లో అప్‌లోడ్ చేస్తే చాలు.
డేటింగ్ చేస్తున్నట్లు తెలిపే ఫొటోను ఉద్యోగి తాను వర్క్ చేస్తున్న సంస్థకు చెందిన ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే సదరు ఉద్యోగి ఖాతాలో సుమారు రూ.750 (66 యువాన్లు) వేస్తుందట సంస్థ యాజమాన్యం. దీంతోపాటు ఈ ప్లాట్ ఫామ్ ద్వారానే ఎవరైనా ఒక ఎంప్లాయి నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని మ్యాచ్ ఫిక్స్ (Match Fix) చేసుకుంటే ప్రోత్సాహకంగా వారి ఖాతాలో రూ.11, 650 (వెయ్యి యువాన్లు) జమ చేస్తోంది. అయితే డేటింగ్ ఏదో ఒకటో రెండు రోజులు చేసి వదిలేస్తే సరిపోదు. కనీసం మూడు నెలలైనా కొనసాగించాలట. ఇక కంటిన్యూ చేస్తూ ఉద్యోగంలో కొనసాగే వారికైతే డబుల్ శాలరీ ఇస్తామని సదరు సంస్థ వెల్లడించింది. కాగా ఈ వినూత్న ఆఫర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 600కు పైగా పోస్టులు ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ అయ్యాయట! ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన రెండవ అతి పెద్ద దేశంగా ఉన్న చైనాలో ప్రజెంట్ యూత్ పాపులేషన్ తగ్గుతోంది. పైగా ఇక్కడ పెళ్లిళ్లతోపాటు బర్త్ రేట్ కూడా దారుణంగా పడిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనాలోని కొన్ని సంస్థలు ఇలాంటి డేటింగ్ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు వైరల్ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.