- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: బెస్ట్ విషెస్ చెబుతూ వైసీపీ నేత ట్వీట్.. అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2(Pushpa-2) చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇటీవలే బిహార్‌లో భారీ ఈవెంట్ పెట్టి ట్రైలర్ లాంచ్ చేయగా.. ఇండియా వైడ్ మరికొన్ని ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌కు విషెస్ చెబుతూ వైసీపీ నేత శిల్ప రవి(Shilpa Ravi) ట్వీట్ పెట్టారు. పుష్ప-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పోస్టు పెట్టారు. దీనికి స్పందించిన బన్నీ.. థాంక్యూ సో మచ్ అని రిప్లై ఇచ్చారు.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో శిల్ప రవికి మద్దతుగా అల్లు అర్జున్ నిలిచిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో మెగా ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో మరోసారి శిల్ప రవి ట్వీట్ పెట్టడం, దానికి బన్నీ వెంటనే రియాక్ట్ అవ్వడంపై మెగా ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2 చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్టోంది. ఫహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.