- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజ్ వీల్ ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే సీజ్ చేస్తాం : డీఎస్పీ రవీందర్ రెడ్డి
దిశ, మెట్ పల్లి : మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలోని కోరుట్ల, మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లోని చాలామంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు వర్షాకాల వరినాట్ల నేపథ్యంలో వారి ట్రాక్టర్లు కేజ్ వీల్స్ అమర్చుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశాంలో డీఎస్పీ మాట్లాడుతూ.. కేజ్ వీల్స్ తో ట్రాక్టర్లను రోడ్లపై నడుపడం వల్ల రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారులు ధ్వంసం అవుతున్నాయని తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యార్థం నిర్మించిన రోడ్లను ధ్వంసం చేస్తున్న ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు కేజ్ వీల్స్ తో ట్రాక్టర్లను రోడ్డుపై నడిపితే ట్రాక్టర్లను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పోలీసులు సూచించిన విధంగా ట్రాక్టర్లను నడపాలని సూచించారు.