- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ విరాసత్ @ 15 లక్షలు
దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం లో తహశీల్దార్ అనుపమ చేసిన విరాసత్ వ్యవహరం వివాదాస్పదంగా మారింది. ఆ భూమికి వారసులము మేమే అంటూ భూ విరాసత్ కోసం ఇరువర్గాల్లో ఒకరు అధికారులను ఆశ్రయించారు. కాగా, ఆధారాలను, వాస్తవ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మమ అనిపించడంతో అక్రమ విరాసత్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆధారాలను తారుమారు చేసి విరాసత్ చేశారంటూ పట్టాదారు తల్లి శంకరమ్మ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. కాగా, అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూ తహశీల్దార్ విరాసత్ చేయడం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. ఈ విరాసత్ విషయంలో రూ.15 లక్షలు చేతులు మారాయని పట్టదారు తల్లి ఆరోపించడం విరాసత్ వివాదానానికి బలం చేకూరుస్తుంది.
చేతులు మారిన రూ.15 లక్షలు..
సహజంగా భూమి విరాసత్ చేసేటప్పుడు వారసుల ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు వారసులను నిర్ణయించి పట్టా మార్పిడి చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. పైగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసేటప్పుడు కుటుంబంలో ఎవరెవరు ఉన్నారనే వివరాలు పూర్తిగా నమోదు అయ్యాయా? ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తున్నారా? అనే విషయాలను పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. కాగా, తల్లి పేరును నమోదు చేయకుండానే సర్టిఫికేట్ జారీ చేశారు. వారసురాలిగా చేస్తున్న మహిళ గత తొమ్మిది సంవత్సరాలుగా వితంతు పింఛన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు చెందిన రేషన్ కార్డులో నమోదై ఉన్న పేర్లను తాజాగా తొలగించి సరి చేసినట్టు బాధితురాలు శంకరమ్మ ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ పట్టా మార్పిడి చేయడానికి అధికారులు మధ్యవర్తుల ద్వారా రూ.15 లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ వారికి పూర్తిగా సహకరించి విరాసత్ చేశారని బాధితురాలు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
అధికారులు చర్యలు తీసుకోవాలి : పట్టాదారు తల్లి శంకరమ్మ
పట్టాదారు ప్రొద్దుటూరి వీరారెడ్డి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ జమున తన కొడుకును వదిలి 30ఏళ్లు అవుతుందని వాపోయింది. పిల్లల తండ్రిగా తన కొడుకు పేరును ఎక్కడా నమోదు చేయలేదని, సంరక్షకులుగా ఇతరుల పేరును పెట్టి ఇప్పుడు వారసురాలును అంటూ వచ్చి తహశీల్దార్ తో కుమ్మక్కై అక్రమంగా విరాసత్ చేయించుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కనీసం గ్రామానికి వచ్చి వివరాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా తాను బతికి ఉండగా తన భర్త ద్వారా సంక్రమించిన భూమిని తనకు తెలియకుండా ఎలా విరాసత్ చేస్తారని శంకరమ్మ అధికారుల తీరును ప్రశ్నించింది. ఇప్పుడు ఉన్న భూమిని తన పిల్లల పేరును పట్టా చేసుకుని అమ్ముకుని వెళ్లి పోతే తన పరిస్థితి ఏమిటని, తననేవరు చూసుంటుకుంటారని కన్నీటి పర్యాంతమైంది. తనకు అన్యాయం చేసిన తహశీల్దార్ అనుపమపై, విరాసత్ చేయించుకున్న మహిళ జమున పై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.
నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
తన పిల్లలపై విరాసత్ చేసుకున్న మహిళ జమున నాపై తప్పుడు ఆరోపణలు చేసి కుటుంబ వ్యవహారాన్ని బజారుకిడుస్తున్నారు. నేను నా భర్త ఆస్తిని తనకు పుట్టిన పిల్లల పేరుపై విరాసత్ చేయించుకున్నాను. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యల కోసం కోర్టును ఆశ్రయిస్తా.
- Tags
- Telugu news