పేదల అభ్యున్నతే.. ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

by Shiva |
పేదల అభ్యున్నతే.. ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
X

దిశ, శంకరపట్నం: తెలంగాణలో పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే ,తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి రథసారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేసి ప్రభుత్వ తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందు, ప్రభుత్వం తరఫున దుస్తులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ పులికోట రమేష్, సర్పంచ్ లు, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story