- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Police officers : గంజాయి కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్.. రిమాండ్ కి తరలింపు..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు. సోమవారం ఇల్లంతకుంట మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మొగిలి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన శివకుమార్ గ్రామంలో బేకరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గన్నేరువరం గ్రామానికి చెందిన బుర్ర ప్రణయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరు కలసి కరీంనగర్ లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుక్కొని వచ్చి సిగరెట్ లలో పెట్టుకొని తాగే వాళ్ళని అన్నారు.
సేవించగా మిగిలింది అమ్మేవారని, ఈ నేపథ్యంలో మండలంలోని వంతడుపుల గ్రామ బతుకమ్మ తెప్ప వద్దకు అమ్మడానికి వస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వచ్చిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 105 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించినట్లు సీఐ తెలిపారు. గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ లకు గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్ లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారం డయల్ 100 లేదా టాస్క్ఫోర్స్ సీఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.