సెస్ ఎన్నికలు: నేడే ఫైనల్ కానున్నTRS ప్యానెల్ లిస్ట్.. KTR తుది నిర్ణయం‌పై ఉత్కంఠ?

by Nagaya |   ( Updated:2022-12-12 05:55:29.0  )
సెస్ ఎన్నికలు: నేడే ఫైనల్ కానున్నTRS ప్యానెల్ లిస్ట్.. KTR తుది నిర్ణయం‌పై ఉత్కంఠ?
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫర సంఘం(సెస్) ఎన్నికలు రాజకీయం రాజుకుంటుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండంతో ప్రధాన పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్‌ని రెడీ చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ లిస్ట్ సోమవారం ఫైనల్ కానుంది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్ర కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, లీడర్లను హైదరాబాద్ రావల్సిందిగా ఆహ్వానించాడు. దీంతో సోమవారం ఉదయమే టీఆర్ఎస్ శ్రేణులు, సెస్ డైరక్టర్ స్థానాలు ఆశీస్తున్న వారు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇంచు మించు సిరిసిల్ల నియోజకవర్గంలో అన్ని సెస్ డైరక్టర్ స్థానాల్లో మంత్రి కేటీఆర్ నిర్ణయమే తుది నిర్ణయం ఐనప్పటికి.. తంగళ్లపల్లి మండల సెస్ డైరక్టర్ స్థానంపైనే అందరి దృష్టి ఉంది.

ఇక్కడ టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు.. సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావ్, కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావ్లు పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకోకముందే చిక్కాల రామారావ్, చీటీ నర్సింగరావ్ తంగళ్లపల్లి మండలంలో పోటా పోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావ్ మాత్రం ఏకంగా వందల మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించి..ప్రెస్ మీట్ పెట్టి మరి తన పోటీ విషయాన్ని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఈ ఇద్దరు నేతలతో మంత్రి కేటీఆర్కు తలనొప్పిగా తంగళ్లపల్లి రాజకీయాలు తయారయ్యాయి.మెట్టు దిగని నేతగా చిక్కాల, పట్టు వదలని నేతగా చీటీ గా తంగళ్లపల్లి రాజకీయాలు తయారయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ ఇద్దరు నేతల పోటీ విషయంమే చర్చ కొనసాగుతుంది.

పార్టీ సినియర్గా నాకు ఇప్పటి వరకు నామీనేట్ పోస్టు రాలేదని చిక్కాల ఉండగా.. 14 ఏళ్లుగా నిర్విరామంగా టీఆర్ఎస్ లో పని చేస్తున్న.. నాకు కూడా నామీనేట్ పోస్టు రాలేదు.. ప్రత్యేక్ష ఎన్నికల్లో నే నా ఆదృష్టాన్ని పరిక్షించుకుంటానని.. నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని చీటీ నర్సింగరావ్ మంత్రి కేటీఆర్ను కోరుతున్నాడు.కేవలం చుట్టం ఐనంత మాత్రన.. పని చేసిన కార్యకర్తగా తనకు పదవి ఇస్తే విమర్శలు వస్తాయంటే ఎలానని ఆవేధన వ్యక్తం చేస్తున్నాడు. చీటీ నర్సింగరావ్ కు తంగళ్లపల్లి మండలంలో మేజార్టీ ప్రజాప్రతినిధులు మద్దతు పలికి.. పోటీలో ఉండమనడంతో చీటీ నర్సింగరావ్ వెనక్కి తగ్గితే.. మరోసారి తనకు రాజకీయ భౌవిష్యత్ ఉండదని భావిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ను ఒప్పించి పోటీలో ఉంటానని తన సన్నిహితుల వద్ద పేర్కొన్నాడు. ఇద్దరు ఇలానే మొండిగా ఉంటే తంగళ్లపల్లి డైరక్టర్ స్థానం ప్యానల్ నుంచి తీసివేసి ఎవరు గెలిచి వస్తే వారే మావాల్లు అన్న చందంగా టీఆర్ఎస్ వైఖరి ఉండనున్నట్లు సమాచారం.గతంలో పెద్దూర్ ఎంపీటీసీ స్థానం కోసం మాజీ ఎంపిపి జూపల్లి శ్రీలత, ప్రస్తుల కౌన్సిలర్ చెన్నమనేని కీర్తీ పోటీ పడగా ఇద్దరికి టికెట్ ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉంచి గెలిచిన జూపల్లి శ్రీలతకు ఎంపిపిగా అవకాశం కల్పించారు. ఇదే విధంగా తంగళ్లపల్లి సెస్ డైరక్టర్ స్థానంలో మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తే.. ఇద్దరు నేతల్లో ఎవరికి ప్రజాధరణ ఉందో అర్థమవుతుందని మండల టీఆర్ఎస్ శ్రేనులు అభిప్రాయపడుతున్నారు. రేపటి నుంచే నామీనేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఈ రోజు టీఆర్ఎస్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రడి కావాల్సి ఉంది. మంత్రి కేటీఆర్ ఈ తంగళ్లపల్లి సెస్ డైరక్టర్ పోటీ నేతల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో అందరు ఆత్రుతతో చూస్తున్నారు.

Read More...

TRS MLC Kalvakuntla Kavitha :కవితకు నోటీసులు.. అసలేంటి CRPC 91?

Advertisement

Next Story

Most Viewed