Tomato Price: టమాటో కేజీ @ రూ.100

by Shiva |
Tomato Price: టమాటో కేజీ @ రూ.100
X

దిశ, గోదావరి ఖని: మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అనడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా టమాటో కిలో ధర ఏకంగా రూ.100 పలుకుతుండటంతో మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులు ఆ ధర చూసి షాక్‌కు గురవుతున్నారు. ప్రతి కూరలో టమాటో లేనిదే కొందరికి ముద్ద దిగదు. అయితే, ధర పెరిగింది కదా అని వినియోగదారులు వాటిని కొనకుండా ఉండలేరు. ఈ నేపథ్యంలో నిత్యం కిలోల చొప్పున టమాటోలు కొనేవారు అర కేజీ, పావు కేజీతో మాత్రమే సరిపెడుతున్నారు. మార్కెట్‌లో టమాటోతో పాటు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా పెరగడంతో సామాన్యులు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

Next Story

Most Viewed