Karge: పశ్చిమాసియాలో భారతీయుల రిక్రూట్‌మెంట్.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by vinod kumar |
Karge: పశ్చిమాసియాలో భారతీయుల రిక్రూట్‌మెంట్.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: యుద్ధంలో దెబ్బతిన్న పశ్చిమాసియాలో భారతీయుల రిక్రూట్‌మెంట్‌ను మోడీ ప్రభుత్వం సులభతరం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 15,000 మంది భారతీయ కార్మికులను రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సహకారాన్ని అందిస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెళ్లినందుకు దేశంలోని యువకులు పలువురు ఏజెంట్ల చేతిలో మోసపోయారని, ఫలితంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాల వల్లే దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని పేర్కొన్నారు. నైపుణ్యం లేని, సెమీ స్కిల్డ్, విద్యావంతులైన యువత తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధ ప్రాంతాల్లో అధిక వేతనాలతో పనిచేయడానికి సిద్ధపడడం, ఉద్యోగాలపై ప్రధాని చేస్తున్న వాదనలు ఆయన వైఫల్యాలను దాచిపెట్టలేవని స్పష్టంగా తెలియజేస్తున్నాయని తెలిపారు. హర్యానాలోని యువత సంఘర్షణ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం బలవంతంగా వెళ్లారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర యువత తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed