అర్ధరాత్రి హడలిపోయిన ఆ గ్రామం..

by Mahesh |
అర్ధరాత్రి హడలిపోయిన ఆ గ్రామం..
X

దిశ, మెట్‌పల్లి: మెట్‌పల్లి మండలాం జగ్గాసాగర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాములవారి, బ్రహ్మంగారి, గుడిలో చోరీకి పాల్పడి సుమారు 80,000 నగదు ఎత్తుకెళ్ళారు. బ్రహ్మంగారి గుడిలో హుండీని ధ్వంసం చేసి నగదు దొంగలించారు. అలాగే రాముల వారి గుడిలో హుండీని ఏకంగా దొంగలించి ఎత్తుకెళ్లి పోయారు. గత కొద్ది రోజుల కిందట ముక్కోటి ఏకాదశి జాతరతో పాటు గోదాదేవి కళ్యాణం ఘనంగా జరిగిందని హుండీలో నగదు భారీగా ఉందని జాతరలు జరిగిన అనంతరం ఇంకా ఉండి లెక్కింపు జరగలేదని గ్రామస్తులు తెలిపారు.

Next Story

Most Viewed