వాహనాల తనిఖీల్లో పోలీసులకు పట్టుబడిన దొంగలు..

by Kalyani |
వాహనాల తనిఖీల్లో పోలీసులకు పట్టుబడిన దొంగలు..
X

దిశ, కరీంనగర్ రూరల్: పోలీసుల కళ్లు కప్పి చైన్ స్నాచింగ్ (దొంగతనాలు) చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టిస్తున్న నిందితులను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి తీగలగుట్టపల్లిలోని అమ్మ గుడి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలబోతారం గ్రామానికి చెందిన ఎడవెల్లి దీపక్, ఎడవెల్లి చందులు ద్విచక్రవాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరలను ఒప్పుకున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ లోని పలు పోలీస్ స్టేషన్స్ పరిదిలోని సీతారాంపూర్, మెహర్ నగర్, నగునూర్, వావిలాల పల్లి, గోపాల్ పూర్, జ్యోతినగర్, తీగలగుట్టపల్లి శివారు ప్రాంతాల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్ గా చేసుకుని ద్విచక్రవాహనంపై వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. చోరీ చేసిన బంగారాన్ని వెల్గటూర్ మండలం సంకెనపల్లి గ్రామానికి చెందిన సింహరాజు నరేష్ కు విక్రయించగా.. కరీంనగర్ లోని తన జ్యువెలరీ వద్ద నిందితుణ్ణి పట్టుకొని అతడి వద్ద నుంచి 105.85 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. అలాగే (TS-02-FJ-6326), బుల్లెట్ మోటార్ సైకిల్ (TS-22-J-6452) ని నిందితుల నుంచి రికవరీ చేసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ కమిషనర్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed