బీఆర్ఎస్ పార్టీని తమను విమర్శించే నైతిక హక్కు ఈ దొంగలకు లేదు : కోరుకంటి

by Disha Web Desk 23 |   ( Updated:2023-10-20 11:06:25.0  )
బీఆర్ఎస్ పార్టీని తమను విమర్శించే నైతిక హక్కు ఈ దొంగలకు లేదు : కోరుకంటి
X

దిశ,గోదావరిఖని : 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాకానే సీఎం కేసీఆర్‌ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతుంది. ప్రతి ముఖంలో ఆనందం నిండుకుంది. సంక్షేమంలో సర్గ యుగానికి కేరాఫ్ తెలంగాణను నిలిపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది అని రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 13,33 వ డివిజన్ లో 'ప్రజా అంకిత యాత్ర' చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ఉందని సీఎం కేసీఆర్‌ గారంటేనే నమ్మకానికి మారుపేరన్నారు. మానవీయ కోణంలో ప్రజల కోసం ఆలోచన చేసే మహనేత సిఎం కేసీఆర్‌ అన్నారు. ఏ ఇంటికి వెళ్లినా, ఎవరిని కదిలించినా బీఆర్ఎస్ మేనిఫెస్టో పట్ల సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసారని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్లు రాకం లత దామోదర్ దొంత శ్రీనివాస్ కో ఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నారాయణదాసు మారుతి, మాదాసు రామమూర్తి దీటి బాలరాజు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed