మహా సభకు ఏర్పాట్ల పరిశీలన.. మే 8 కేటీఆర్ రాక..

by Sumithra |
మహా సభకు ఏర్పాట్ల పరిశీలన.. మే 8 కేటీఆర్ రాక..
X

దిశ, గోదావరి ఖని : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 8 న రామగుండం నియోజక వర్గానికి రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఏర్పాట్లను నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లాగా పేరుపొందిన రామగుండం నియోజకవర్గానికి ఈ నెల 8వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని తెలిపారు.

అయితే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని అన్నారు. అయితే ఎంతో మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఐటీ, ఇండస్ట్రియల్ పార్కు, నూతన పోలీస్ కమిషనరేట్ భవనంతో పాటు పలు కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. కాగా ఈ మహాసభకు 50 వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed