- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారి బంధం గల్లీలో లొల్లి.. ఢిల్లీలో దోస్తీ..

దిశ, వేములవాడ : సిరిసిల్ల పర్యటనలో బండి సంజయ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ బంధం గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ వలే ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో రాచరిక పాలన జరిగితే దానికి బీజేపీ మద్దతు ఇచ్చిందని మండిపడ్డారు. కేంద్రంలో గత 11 సంవత్సరాలుగా రాచరిక పాలన కొనసాగుతుందని, బీజేపీ ప్రభుత్వ నైజం ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ తొక్కేయడమేనని అన్నారు. గతంలో కేంద్రంలో ఈడీ, ఐటీ రాష్ట్రంలో సీబీఐ, పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు పాలన కొనసాగించాయని, 15 మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలనను అంతం చేసి ప్రజాపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చిన విషయం బండి సంజయ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ చేసే కుయుక్తులకు బీజేపీ వంతపాడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుండి ఎక్కువ మొత్తం పన్నులను తీసుకొని రాష్ట్రానికి తక్కువ అందజేస్తుందన్నారు. పన్నుల రూపంలో రూపాయి ఇచ్చే బీహార్ కు 7 రూపాయలు, రూపాయి ఇచ్చే ఉత్తరప్రదేశ్ కు మూడు రూపాయలు ఇచ్చి, తెలంగాణకు మాత్రం 45 పైసలు ఇస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సబర్మతి నది, గంగానదిని శుద్ధి చేసుకుంటారు కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే మూసీ రివర్ కు నిధులు ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డుకు, మెట్రోకు, మూసీ రివర్ కు నిధులు ఇవ్వకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయేలా చేసేది బీజేపీ వారేనని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆపే ప్రయత్నం వారు చేస్తున్నారని అన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారని, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని స్పష్టం చేశారు. బండి సంజయ్ తన కార్యకర్తలకు జోష్ నింపడం కోసం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 8 పార్లమెంట్ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు మీకు ఇస్తే గత బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అణా పైసా కూడా తేలేకపోయారని ధ్వజమెత్తారు. 11 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ కోసం ఒక్క పథకమైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు.