భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ..

by Sumithra |
భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ..
X

దిశ, కొత్తపల్లి : కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. దేవాలయంలో భజన ముగించుకుని రాత్రి 10.30 గంటలకు గుడికి తాళం వేసి వెళ్లిన పూజారి బుధవారం ఉదయం తిరిగి గుడికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి ఆలయ కమిటీ అధ్యక్షుడికి సమాచారం అందించారు. చోరీలో పంచముఖ హనుమాన్ విగ్రహం, ఇత్తడి సామగ్రితో పాటు, ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సుమారు రూ.40 వేల రూపాయలు విలువ చేసే వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి తెలిపారు.

Advertisement

Next Story