క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

by Sridhar Babu |   ( Updated:2024-12-30 10:13:56.0  )
క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు
X

దిశ,తల్లాడ : మండలంలోని పాత మిట్టపల్లి నుంచి నారయ్య బంజార వెళ్లే దారిలో రోడ్డుపై చేసిన క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోకి వెళ్లే మూల మలుపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి క్షుద్ర పూజలు చేశారు. ఘటనా స్థలంలో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోశారు. రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేయడంతో పాటు దాని చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోకి వచ్చే వారు, స్కూలు పిల్లలు దీనిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed