Breaking News : రైలు పట్టాలపై రెండు నెలల చిన్నారి.. కాపాడిన రైల్వే సిబ్బంది

by M.Rajitha |
Breaking News : రైలు పట్టాలపై రెండు నెలల చిన్నారి.. కాపాడిన రైల్వే సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్ : పెద్దపల్లి(Peddapalli)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ రెండు నెలల బాబును రైలు పట్టాల(Railway Track) మధ్య వదిలి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నవ మాసాలు మోసి కన్న తల్లికి ఎలాంటి కష్టమొచ్చిందో లేదా వదిలించుకోవాలనుకుందో తెలియదు కానీ అభం శుభం తెలియని చిన్నారని రైలు పట్టాలపై వదిలి వెళ్లిన హృదయవిదారకర సంఘటన పలువురిని కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్‌సీ గేట్ సమీపంలో రైల్వే ట్రాక్ మధ్య గుర్తు తెలియని రెండు నెలల బాబును ఎవరో వదిలిపెట్టి వెళ్లారు. సమాచారం అందుకున్న రామగుండం రైల్వే సీఐ బి.సురేష్ గౌడ్, ఎస్ఐబీ. క్రాంతి కుమార్, కానిస్టేబుల్ సుమన్‌ వెంటనే అక్కడికి చేరుకున్నారు. శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story